రథోత్సవంలో అపశృతి.. ఐదేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడంటే..

రథోత్సవంలో అపశృతి.. ఐదేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడంటే..

ఆ ఊరిలో పండగ వేళ ఘోర విషాదం చోటు చేసుకుంది. ఊరుఊరంతా కలిసి సంబరంగా జరుపుకుంటున్న రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రథచక్రాల కింద పడి నగిలిపోయి ఐదేళ్ళ చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన కేరళలోని కొల్లాంలోని కొట్టన్‌కులంగర ఆలయంలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కేరళలోని కొల్లాంలోని కొట్టన్‌కులంగర ఆలయంలో ఊరి ప్రజలందరూ కలిసి చమయవిళక్కు  పండగ ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారీ రధంలో దేవుడిని ఊరేగించారు.  ఈ గంథరగోళంలో తండ్రి చేతుల్లో నుంచి ఐదేళ్ల చిన్నారి  జారిపడి ఉత్సవ రథం చక్రాల కింద నలిగి పోయింది. రథం చిన్నారి శరీరంపై నుంచి వెళ్లింది. దీంతో రథం చక్రాల కింద నలిగి తీవ్రగాయాలైన చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా..  చికిత్స పొందుతూ బాలిక అక్కడ మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ALSO READ | డెలివరీ బాయ్స్ కష్టాలు ఇలాగే ఉంటాయి.. ఎక్కడికెళ్లినా చులకనే

 చవరా నివాసి దంపతుల కుమార్తె క్షేత్ర. తల్లిదండ్రులతో కలిసి ఆలయానికి వచ్చిన క్షేత్ర ప్రమాదవశాత్తు ఉత్సవ రథం చక్రాల కింద పడి మృతి చెందినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. రథాన్ని లాగుతున్న బహిరంగ మైదానంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  కేరళ రాష్ట్రంలో చమయవిళక్కు పండుగ రోజున పురుషులు స్త్రీల వేషధారణతో దేవాలయాల్లో ప్రార్థనలు చేస్తుంటారు. కేరళ రాష్ట్రంలో చమయవిళక్కు పండుగ చాలా ముఖ్యమైనది. పండగ సందర్భంగా రథాన్ని లాగుతున్నారు. కొన్ని సార్లు పిల్లలు కూడా రథానికి కట్టిన తాడును లాగుతుంటారు. ఈ క్రమంలో ప్రమాదాలు చోటుచేసుకుంటూ ఉంటాయి.